ఓట్ల కోసం పాట్లు... అసోంలో వరాల వర్షం కురిపించిన బీజేపీ!

  • అసోంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు బీజేపీ వరాలు
  • పెళ్లికి రూ. 38 వేల బంగారం
  • టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసయితే ఈ-బైక్
త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతూ, తాయిలాలను ప్రకటిస్తుంటే, అసోం బీజేపీ మరో అడుగు ముందుకేసి వరాల వర్షం కురిపించింది. పేద అమ్మాయి పెళ్లికి రూ. 38 వేల విలువైన బంగారాన్ని కానుకగా ఇస్తామని పార్టీ రాష్ట్ర నేత, ఆర్థికమంత్రి హిమంత బిశ్వాశర్మ తెలిపారు.

టెన్త్ లో ఫస్ట్ క్లాస్ సాధించిన అమ్మాయిలకు ఈ-బైక్ లను కానుకగా ఇస్తామని అన్నారు. అమ్మాయి చదువు కోసం రూ. 50 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని కళాకారులు, క్రీడాకారులకు ఒక్కొక్కరికీ రూ. 50 వేల ఇన్సెంటివ్ ను, 45 ఏళ్ల లోపు వయసున్న వితంతువులకు రూ. 25 వేల ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. పాడుబడిన ఆలయాల మరమ్మతులకు రూ. 10 లక్షల చొప్పున గ్రాంట్ ఇస్తామని కూడా వరమిచ్చారు.
Go Back to Shorts
Assom
BJP
Votes
Elections

More Telugu News